HomeTelugu Trendingచిరంజీవితో అనుష్క రొమాన్స్‌!

చిరంజీవితో అనుష్క రొమాన్స్‌!

3 15
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా.. కొరటాల శివ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ కథలో పొందుపరిచాడు కొరటాల శివ. ఈ సినిమాలో హీరోయిన్‌గా ‘త్రిష’ను తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు నుంచి త్రిష తప్పుకోవడం వల్ల కాజల్ పేరు వినిపించింది. ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో ఈ జోడి రొమాన్స్‌ అభిమానులు ను ఆకట్టుకుంది అందువల్ల ఈ కాంబినేషన్‌ పై ఉత్సాహాన్ని కనబరిచారు. .

కాగా తాజాగా ఇప్పుడు అనుష్క పేరు వెలుగులోకి వచ్చింది. చిరంజీవికి జోడీగా .. పాత్ర పరంగా అనుష్క అయితే కరెక్ట్ గా ఉంటుందని భావించి, ఆమెను సంప్రదిస్తున్నట్టుగా సమాచారం. ఈ ఆఫర్ ను అనుష్క వదులుకోకపోవచ్చని అంటున్నారు. గతంలో ‘స్టాలిన్’ సినిమాలో చిరంజీవి సరసన అనుష్క ఒక ప్రత్యేక గీతంలో సందడి చేసిన సంగతి తెలిసిందే. సీనియర్‌ హీరో చిరంజీవి ముదురు భామ అనుష్కల కాంబినేషన్‌ ఎలా ఉండబోతుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu