ఆస్కార్ వేదికపై దుమ్మురేపిన ‘నాటునాటు’

సినీ ప్రపంచంలో తెలుగు జెండా సగర్వంగా రెపరెపలాడింది.. అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని డోల్బీ థియేటర్ వేదికగా 95వ ఆస్కార్‌ వేడుక ఘనంగా జరిగింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటునాటు’ పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. ఈ పాట తెలుగు చిత్ర సీమను ప్రపంచానికి పరిచయం చేసింది.

‘నాటునాటు’ ఆస్కార్‌కు నామినేట్ అయిన నాటి నుంచి ఆస్కార్ అవార్డు విన్నింగ్‌ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సమకూర్చిన బాణీకి.. చంద్రబోస్ అందించిన పదాలు.. ప్రపంచ రికార్డును భారత్‌ కు అందించాయి. దీంతో ఆర్ఆర్ఆర్ టాక్ ఆఫ్ ది ఆస్కార్ గా మారింది.

రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. ఆస్కార్‌ వేడుక ఆరంభంలోనే నాటు నాటు స్టెప్పులతో హోస్ట్ ని డయాస్ మీద నుంచి తీసుకొని వెళ్ళడం స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి. బాలీవుడ్‌ నటి దీపికా పదుకునే స్టేజ్ మీదకి వచ్చి ఆర్ఆర్ఆర్ సినిమా గురించి అలాగే నాటు నాటు పాట గురించి చాలా ఉత్సాహంగా పరిచయం చేసింది.

ఆస్కార్ కోసం ఇండియా నుంచి బెస్ట్ ఒరిజినల్ కేటగిరీలో నామినేట్ అయిన ఫస్ట్ సాంగ్ గా దీపికా అభివర్ణించింది. అలాగే గ్లోబల్ వైజ్ గా ట్రెండ్ అయిన సాంగ్ గా కూడా ప్రెజెంట్ చేసింది. తరువాత నాటు నాటు లైవ్ పెర్ఫార్మెన్స్ స్టేజ్ మీద స్టార్ట్ అయ్యింది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కాల భైరవ సాంగ్ ని ఎనర్జిటిక్ గా ఆలపించారు. ఇక సాంగ్ పర్ఫామెన్స్ పూరైన తరువాత ఈవెంట్ లో హాలీవుడ్ ప్రముఖులు అందరూ కూడా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి క్లాప్స్ తో పాటపై ప్రశంసలు కురిపించారు.

ఇక రాజమౌళి ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత బయటకి వచ్చి మీడియాతో మాట్లాడుతూ.. తన సంతోషాన్ని పంచుకున్నారు. నాటు నాటు సాంగ్ లైవ్ పెర్ఫార్మెన్స్ అయిన తర్వాత థియేటర్ లో అందరూ లేచి స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం చాలా గొప్ప గౌరవంగా భావిస్తున్నా అని అన్నారు. తనని ఆ సంఘటన ఆశ్చర్యానికి ఆనందానికి గురి చేసిందన్నారు.

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates