
అక్కినేని నాగచైతన్య ఈ ఏడాది ‘బంగార్రాజు’ సినిమాతో హిట్ కొట్టిన, మరో సినిమాతో పలకరించడానికి రెడీ అవుతున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఆ సినిమా పేరే ‘థ్యాంక్యూ’. విక్రమ్ కుమార్ ఈ సినిమాకి డైరెక్షన్‌లో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.
తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్‌కి డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 25వ తేదీన సాయంత్రం 5:04 నిమిషాలకు టీజర్ ను విడుదల చేస్తున్నట్టుగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. స్టైలీష్ లుక్ తో నాగచైతన్య కనిపిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించనుంది.
కథ ప్రకారం ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు సందడి చేయనున్నారు. మరో ఇద్దరు హీరోయిన్‌లుగా అవికా గోర్ .. మాళవిక నాయర్ నటించారు. జులై 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత పరశురామ్ తో కలిసి చైతూ సెట్స్ పైకి వెళ్లనున్నాడు.













