యాడ్ ఫిల్మ్ మేకర్ గా చైతు!

అక్కినేని నాగచైతన్య కెరీర్ పరంగా తన సూట్ అయ్యే కథలను ఎన్నుకుంటూ ఒక్కో విజయాన్ని అందుకుంటూ ముందుకుంటూ సాగుతున్నాడు. ఇటీవల ‘ప్రేమమ్’, ‘సాహసం శ్వాసగా సాగిపో’, ‘రా రండోయ్ వేడుక చూద్దాం’ ఇలా వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న చైతు ఇప్పుడు ‘యుద్ధం శరణం’ అంటూ త్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే ప్రేక్షకుల్లో హైప్ ను క్రియేట్ చేశాడు. అలానే తన తదుపరి సినిమా చందు మొండేటి దర్శకత్వంలో చేయడానికి సిద్ధమవుతున్నాడు. 
చైతు, సమంతల వివాహం తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో చైతు ఓ యాడ్ ఫిల్మ్ మేకర్ గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం చైతు తన లుక్ ను కాస్త మార్చబోతున్నాడట. ప్రస్తుతం చందు మొండేటి తన కథకు తుది మెరుగులు దిద్దే పనిలో పడ్డాడు. ఈ సినిమాలో నాగార్జున కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సివుంది!