చైతు సినిమా అదే స్పెషాలిటీ!

‘యుద్ధం శరణం’ సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో ప్రస్తుతం నాగచైతన్య చేస్తోన్న ‘సవ్యసాచి’ సినిమాపై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. చందు మొండేటి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కోలీవుడ్ హీరో మాధవన్ కూడా నటిస్తున్నాడని తెలిసిందే. తెలుస్తున్న సమాచారం ప్రకారం మాధవన్ ఈ సినిమాలో విలన్ గా కనిపిస్తాడని అంటున్నారు. 

మాధవన్ తో నాగ చైతన్య చేసే సీన్స్ సినిమాకే హైలెట్ గా ఉంటాయని తెలుస్తుంది. ఈ సినిమాలో చైతుకి కొన్ని శక్తులు ఉంటాయట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.