చైతు కోసం రంగంలోకి మాధవన్!

యువ నటుడు అక్కినేని నాగచైతన్య ‘ప్రేమమ్’, ‘సాహసం శ్వాసగా సాగిపో’, ‘రా రండోయ్ వేడుక చూద్దాం’ వంటి సినిమాలతో తన ఖాతాలో మంచి హిట్స్ ను వేసుకున్నాడు. గత కొంత కాలంగా పరిశీలిస్తే చైతు తన ప్రతి సినిమాలో కూడా ఓ కొత్త పాయింట్ ఉండేలా చూసుకుంటున్నాడు. ఆ విధంగా విజయాలను అందుకుంటున్నాడు. ఇప్పుడు చందు మొండేటి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు చైతు. అదే ‘సవ్యసాచి’. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. థ్రిల్లర్ నేపధ్యంలో ఈ సినిమా సాగబోతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో తమిళ నటుడు మాధవన్ కనిపించబోతున్నాడని సమాచారం.
ఆయనకు కథ వినిపించిన వెంటనే నచ్చడంతో నటించడానికి అంగీకరించారట. చాలా కాలంగా మాధవన్ తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. ఆయన డబ్బింగ్ సినిమాలు కూడా విడుదల కావడం లేదు. కానీ తెలుగులో ఆడియన్స్ లో నటుడిగా అతడికి మంచి పేరుంది. చైతు సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గర కానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం చైతు తన పెళ్లి కారణంగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడు. ఈ గ్యాప్ లో సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.