HomeTelugu Trending'లక్ష్య' క్లైమాక్స్ షూట్‌లో నాగశౌర్య

‘లక్ష్య’ క్లైమాక్స్ షూట్‌లో నాగశౌర్య

Naga Shaurya in lakshya cli
టాలీవుడ్‌ యువ నటుడు నాగశౌర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వరుడు కావలెను, పోలీస్ వారి హెచ్చరిక సినిమాలు లైన్‌లో ఉన్నాయి. కరోనా కారణంగా సినిమా షూటింగ్‌లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటిస్తున్న ‘లక్ష్య’ సినిమా షూటింగు కోసం ఈ రోజున మళ్లీ సెట్స్ పైకి వచ్చేశాడు.

ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా క్లైమాక్స్ షూట్ కు సంబంధించిన మేకింగ్ వీడియో కూడా విడుదల చేశారు. నారాయణ దాస్ నారంగ్ .. పుష్కర్ రామ్మోహన్ రావు .. శరత్ మరార్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కెరియర్ పరంగా ఇది నాగశౌర్యకి 20వ చిత్రం. సంతోష్ జాగర్లపూడి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. కీలక పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. ఈ సినిమాలో నాగశౌర్య ప్రేక్షకులను సిక్స్ ప్యాక్ తో అలరించనున్నడు. విలువిద్య నేపథ్యంలో సాగే కథ కావడం వలన ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu