HomeTelugu Trending‘వరుడు కావలెను’ టీజర్‌

‘వరుడు కావలెను’ టీజర్‌

Naga Shaurya varudu kaavale

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య తాజాగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. రీతువర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్‌, టీజర్‌తో పాటు పాటలకి మంచి స్పందన వచ్చింది.

తాజాగా శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని ఈ చిత్రం నుంచి టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. టామ్‌ అండ్‌ జెర్రీలా నిత్యం గొడవపడే ఓ యువతి, యువకుడి మధ్య ప్రేమ ఎలా పుట్టిందనేదే ఈ మూవీ నేపథ్యం అని టీజర్‌ చూస్తే అర్థమవుతుంది. డైలాగ్స్‌ యూత్‌ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu