HomeTelugu Trending'F3'లో మహేశ్‌ బాబు.?

‘F3’లో మహేశ్‌ బాబు.?

11 7టాలీవుడ్‌ డైరెక్టర్‌ అనీల్ రావిపూడి వరుస హిట్లతో మంచి జోరు మీదున్నాడు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్‌ బాబుతో తెరకెక్కించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. అనీల్ కెరియర్లో ఆ సినిమా మైలు రాయిగా నిలిచింది. ఇప్పుడు మహేశ్‌ తన నెక్స్ట్ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అటు అనీల్ రావిపూడి కూడా ‘ఎఫ్3’ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. అయితే ‘ఎఫ్3’ సంబందించిన ఒక వార్త ఇప్పుడు ఫిలిమ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ లతో ‘ఎఫ్2’ సినిమాను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సారి ముగ్గురు హీరోలతో కలిసి సినిమా చేస్తాను అని అనౌన్స్ చేసాడు అనీల్‌. వెంకటేష్, వరుణ్, రవితేజాలతో సినిమా చేయాలని మొదట్లో అనుకున్నాడు .. కానీ ఇప్పుడు మహేష్ బాబు పేరు వినిపిస్తుంది. రవితేజ ప్లేస్ లో మహేష్ నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందుకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మహేష్, మాస్ రాజా ప్లేస్ ను రీప్లేస్ చేస్తాడా లేక గెస్ట్ రోల్ లో కనిపిస్తాడా అన్నది చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu