HomeTelugu Trendingబంగార్రాజు షూటింగ్‌ షురూ..

బంగార్రాజు షూటింగ్‌ షురూ..

Nagarjuna and naga chaitany

క్కినేని హీరోలు నాగార్జున, నాగ‌చైత‌న్యలు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘బంగార్రాజు’. క‌ల్యాణ్‌కృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కిన హిట్‌ చిత్రం సోగ్గాడే చిన్ని నాయ‌నకు సీక్వెల్‌గా బంగార్రాజు రూపొందుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ క్రేజీ మ‌ల్టీ స్టారర్ ప్రాజెక్ట్‌ సెట్స్పైకి వచ్చింది. హైద‌రాబాద్‌లో బంగార్రాజు రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. సోగ్గాళ్ల షూటింగ్ ప్రారంభ‌మైంద‌ంటూ మేక‌ర్స్ విడుద‌ల చేసిన పోస్టర్‌లో రెండు వైపులా రెండు బుల్లెట్ బైక్స్ క‌నిపిస్తుండ‌గా.. బ్యాక్ డ్రాప్‌లో ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఈ సారి బంగార్రాజు ప్రేక్ష‌కుల‌కు మంచి వినోదం పంచ‌డం ఖాయ‌మ‌ని మేక‌ర్స్ రిలీజ్ చేసిన తాజాగా స్టిల్‌తో అర్థ‌మ‌వుతుంది.

ఫస్ట్‌ పార్టులో నాగార్జున‌కు జోడీగా న‌టించిన ర‌మ్య‌కృష్ణ, బంగార్రాజులో కూడా జోడి కట్టింది. ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి నాగచైత‌న్య‌కు జోడీగా న‌టిస్తోంది. ప్రస్తుతం నాగార్జున ప్ర‌వీణ్ స‌త్తారు దర్శకత్వం లో ఓ సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టు బ్ర‌హ్మాస్త్ర‌లో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. నాగచైత‌న్య న‌టించిన ల‌వ్ స్టోరీ సెప్టెంబ‌ర్ 10న విడుదల కానుంది. దీంతోపాటు అమీర్‌ఖాన్‌ లాల్ సింగ్ చ‌ద్దాలో చై కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!