
టాలీవుడ్‌లో కింగ్ నాగార్జున, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘శివమణి’ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాలేదు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత మళ్లీ ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మెరిసే అవకాశాలు కన్పిస్తున్నాయి. పూరి దర్శకత్వంలో నాగ్ ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
లాక్‌డౌన్ సమయంలో నాగార్జున కోసం పూరీ ఓ ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ రాసాడట. సరికొత్త గెటప్‌లో నాగార్జునను చూపించబోతున్నాడట. ఫాంటసీ స్టోరీ బ్యాక్ డ్రాప్ ఈ సినిమా సాగుతుందని ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. గత చిత్రాల మాదిరే ఈ సారి కూడా వీరిద్దరి కాంబినేషన్ విజయం సాధిస్తుందో లేదో చూడాలి మరి.













