నానితో నాగ్ మల్టీస్టారర్!

తెలుగు తెరపై కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నాగార్జున తన సినిమాలతో కొన్ని ప్రయోగాలు కూడా చేశారు. కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటే చాలు ఇతర హీరోలతో కూడా కలిసి నటించడానికి సిద్ధపడతారు ఈ సీనియర్ హీరో. ఈ క్రమంలో మంచు విష్ణు, అలానే కార్తీలతో కలిసి ఆయన సినిమాలు చేశాడు. తాజాగా యంగ్ హీరో నానితో కలిసి సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు ఈ హీరో.

దర్శకుడు ఎవరనే విషయంపై స్పష్టత లేదు గానీ సినిమాలో నటించడానికి ఈ ఇద్దరు హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓ బడా నిర్మాత ఈ కాంబినేషన్ సెట్ చేశాడని అంటున్నారు. రీసెంట్ గా నాగార్జున, నాగచైతన్య అలానే నిఖిల్ లతో కలిసి సినిమాలు చేస్తాడనే మాటలు వినిపించాయి. కానీ ఆ సినిమాలు సెట్ కాలేదు. కానీ నానితో మాత్రం సినిమా పక్కా ఉంటుందట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని చెబుతున్నారు.