పాక్‌ యాడ్‌కు స్పైసీ ఆన్సర్.. తన పై కప్పులు (బ్రా) తీసుకోమంటూ.. పూనమ్ హాట్ కామెంట్స్‌

పూనమ్ పాండే.. వివాదానికి పెట్టింది పేరు. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో .. సోషల్ మీడియాను వేదికగా ఎంచుకుంది. తన సెక్సీ వీడియోలను, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులకు నయనానందం కలిగిస్తోంది. అయితే, తనకు ఎవరిమీదైనా ప్రేమొచ్చిన, కోపమొచ్చినా కూడా ఇదే విధంగా సెక్సీగా స్పందిస్తోంది ఈ హాట్‌ బ్యూటీ. న్యూడ్‌గా ఆన్సర్ ఇస్తోంది. తాజాగా, పాకిస్థాన్‌కు కూడా ఇలాంటి స్పైసీ ఆన్సర్ ఒకటి ఇచ్చింది.

ప్రపంచ కప్ ప్రచారంలో భాగంగా జూన్ 16న మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫర్డ్‌లో ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌పై ఇటు భారత్, అటు పాక్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ ఉంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు పాకిస్థాన్‌కు లైవ్ స్ట్రీమింగ్ మొబైల్ యాప్ ‘జాజ్ టీవీ’ ఒక యాడ్‌ను క్రియేట్ చేసింది. పాకిస్థాన్‌కు పట్టుబడిన భారత వాయుసేన వీరుడు అభినందన్‌ వీడియోకు పేరడీగా ఈ యాడ్‌ను తయారుచేసింది. ఈ యాడ్‌ ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. పాకిస్థాన్‌కు మిగిలేది టీ కప్పేనంటూ భారత అభిమానులు ఏకి పారేశారు. తాజాగా, ఈ యాడ్‌పై పూనమ్ పాండే స్పందించింది.

పూనమ్ స్పందిస్తే ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాలా? ‘మీకు టీ కప్పు ఏమి సరిపోతుంది. ఇవిగో నా పైకప్పులు రెండూ తీసుకోండి’ అంటూ తన లోదుస్తు(బ్రా)ను తీసి చూపించింది. లోదుస్తును తీస్తోన్న వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది. ఇంకేముంది మరోసారి పూనమ్ సంచలనంగా మారింది. ఒక యుద్ధ వీరుడిని ఇలా అగౌరవపరచడం సరికాదంటూ పాకిస్థాన్‌కు పూనం క్లాస్ తీసుకుంది. ప్రస్తుతం పూనమ్ వీడియోను పాక్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.