నమిత ఆటో వెనుక పరుగులు పెట్టింది!

తమిళనాట నమిత అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె కోసం దేవాలయాన్ని కూడా కట్టించారు.
సినిమాలు లేకున్నా.. హిట్స్ లేకున్నా.. జనాలకు ఆమెపై ఉన్న అభిమానం మాత్రం తగ్గలేదు.
ఆమె బయటకు వెళ్తే కలవడానికి ప్రయత్నించే అబిమానులు ఎందరో ఉన్నారు. అయితే ఆమె
మాత్రం కారు దిగి ఓ ఆటో వెనుక పరుగులు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు
విషయంలోకి వస్తే ధనలక్ష్మీ అనే మహిళా ఆటోను నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తోంది.
నమిత రోడ్ మీద వెళ్తున్న సమయంలో ధనలక్ష్మిని చూసి కారు ఆపింది. ఆ విషయం గమనించని
ధనలక్ష్మి ముందుకు వెళ్లిపోయింది. ఆమె ఆటో వెనుకే నమిత పరుగులు పెట్టి మరీ ఆమెను కలిసి
కాసేపు ముచ్చటించింది. ధైర్యంగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆమె ఎందరికో
స్పూర్తి అని నమిత పొగడ్తలతో ముంచెత్తింది. అంతేకాదు ఆమెతో సెల్ఫీ దిగి తన సోషల్ నెట్ వర్కింగ్
సైట్లలో పోస్ట్ చేసింది. తమ అభిమాన నటి చేసిన పని తెలుసుకొని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates