నందమూరి ఫ్యామిలీ సినిమా!

గతంలో అక్కినేని హీరోలు, అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి మనం సినిమాలో కనిపించారు. ఆ సినిమా తరువాత ఇండస్ట్రీలో కుటుంబాలు అలా కలిసి సినిమా చేయాలనుకున్నారు. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ హీరోలు కలిసి ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్. హరికృష్ణ గతంలో వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో చాలా సినిమాలు చేశారు. కానీ ఆ తరువాత మళ్ళీ వెనక్కి తగ్గారు.

అయితే ఇప్పటికీ మంచి పాత్ర పడితే సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారాయన. దీంతోఆయనను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హరికృష్ణకు సరిపడా ఓపాత్రను సిద్ధం చేస్తే ఆయనతో కలిసి సినిమాలో నటించడానికి కల్యాణ్ రామ్ ప్లాన్ చేస్తున్నాడు. అలానే ఈ సినిమాలో ఓ ఫ్రేమ్ లో ఎన్టీఆర్ కూడా కనిపించే ఆలోచన ఉందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన కథపై ఓ దర్శకుడు కసరత్తు చేస్తున్నాడట. వచ్చే ఏడాదిలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.