చిరు సినిమా ఆమెను ఇబ్బందుల్లో పడేసింది!

ఇద్దరమ్మాయిలతో, సరైనోడు వంటి సినిమాల్లో నటించి హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నటి కేథరిన్ త్రెసా. సరైనోడు సినిమా తరువాత యూత్ అందరూ ఆమెను యంగ్ ఎమ్మెల్యే అని పిలుచుకుంటున్నారు. బన్నీతో కేథరిన్ కు ఉన్న స్నేహం కారణంగా ఆమెను చిరు 150వ సినిమాలో
స్పెషల్ సాంగ్ లో నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ అవకాశాన్ని కాస్త తనకున్న తలపొగరుతో పోగొట్టుకుంది. మాస్టర్ లారెన్స్ తో షూటింగ్ సమయంలో వచ్చిన విభేదాల కారణంగానే ఆమెను తప్పించినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా చిరంజీవి కూతురు సుస్మితతో కూడా కేథరిన్ పొగరుగా ప్రవర్తించిందట. కేథరిన్ ను సినిమా నుండి తప్పించడానికి కారణం ఏదైనా.. సరే చిరంజీవి గారి సినిమా నుండే బయటకు వచ్చిందంటే ఆమె ఆటిట్యూడ్ మామూలిది కాదని దర్శకనిర్మాతలు అవకాశాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. మొత్తానికి ఒక పాట కేథరిన్ ను ఇరకాటంలో నెట్టేసింది!