HomeTelugu Trendingటాలీవుడ్ సీనియర్ హీరోలందరిలో Nandamuri Balakrishna కే ఈ అరుదైన రికార్డు!

టాలీవుడ్ సీనియర్ హీరోలందరిలో Nandamuri Balakrishna కే ఈ అరుదైన రికార్డు!

Nandamuri Balakrishna's New Feat – Only Senior Hero to Reach This Milestone!
Nandamuri Balakrishna’s New Feat – Only Senior Hero to Reach This Milestone!

Nandamuri Balakrishna’s new record:

Nandamuri Balakrishna వరుసగా విజయవంతమైన సినిమాలతో రోల్‌లో ఉన్నారు. తాజాగా రిలీజ్ అయిన డాకూ మహరాజ్ ప్రేక్షకుల్ని అలరించి, బాక్స్ ఆఫీస్‌లో రికార్డులు సృష్టిస్తోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్‌ను సాధించి, రూ. 56 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమాకు క్రిటిక్స్ నుండి పాజిటివ్ రివ్యూలు లభించాయి.

అమెరికాలో ఈ సినిమా అద్భుతంగా రన్ అవుతుంది. డాకూ మహరాజ్ ఇప్పటికే $1 మిలియన్ మార్కును దాటింది. ఇదే బాలకృష్ణకి నాలుగవ మిలియన్ డాలర్ల సినిమా. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేశరి’ సినిమాలతో బాలయ్య ఈ ఘనత సాధించడమే కాకుండా, టాలీవుడ్ సీనియర్ హీరోలలో 4 consecutive million dollar సినిమాలు సాధించిన ఏకైక హీరోగా నిలిచారు.

ఈ సినిమా ప్రస్తుతం మంచి వసూళ్లను రాబడుతోంది. అటు ఇండియాలో, ఇటు విదేశాల్లో కూడా డాకూ మహరాజ్ మంచి బిజినెస్ చేస్తోంది. కథ, సంగీతం, పాత్రల ప్రదర్శన అన్నీ మేలు చేస్తున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, ఉర్వశీ ఔట్‌లా, చందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు. థమన్ సంగీతం అందించారు, పాటలు కూడా సినిమాకు మంచి బ్రాండ్ అట్రాక్షన్ గా నిలిచాయి.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!