HomeTelugu NewsNandamuri Chaitanya Krishna: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు వార్నింగ్

Nandamuri Chaitanya Krishna: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు వార్నింగ్

Nandamuri Chaitanya Krishna

Nandamuri Chaitanya Krishna: ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ మంటలు రేకెత్తించాయి. ఇప్పటికీ ఏపీలో అల్లర్లు కొనసాగుతునే ఉన్నాయి. ఈ క్రమంలో సెలబ్రెటీలు కూడా ఎన్నికల్లో ఏదో ఒక పార్టీకి సపోర్ట్‌ చేశారు. మొన్నటికి మొన్న మెగా ఫ్యామిలీలో ఎన్నికలలో మద్దతు గురించి నాగబాబు, అల్లు అర్జున్ మధ్య రచ్చ కొనసాగింది. తాజాగా ఎన్నికలలో మద్దతుపై నందమూరి ఫ్యామిలీలోను రగడ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు, వైసీపీ ఫ్యాన్స్‌కు కలిపి వార్నింగ్ ఇచ్చారు.. హీరో నందమూరి చైతన్య కృష్ణ.

ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. జూనియర్‌ ఫ్యాన్స్‌కు ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీకి ఇదే నా వార్నింగ్‌. మీరు సపోర్ట్ చేశారు అని అంటారు. కానీ మీరు ఎవరు సపోర్ట్ చేయడానికి.? మా బొచ్చు కూడా పీకలేరు.. నేను ఉండగా చంద్రబాబు మావయ్య, బాలకృష్ణ బాబాయ్‌ని ఎవరూ ఏం చేయలేరు అంటూ తన ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు నందమూరి చైతన్య కృష్ణ.

అలాగే నా సినిమా బ్రీత్ మూవీ రిలీజ్ టైమ్‌లోనూ జూనియర్ ఫ్యాన్స్, వైఎస్సార్‌సీపీ వాళ్లు కలిసి నన్ను బాగా ట్రోల్ చేశారని, జాగ్రత్తగా ఉండండి అంటూ కృష్ణ చైతన్య వార్నింగ్‌ ఇచ్చారు. ఈ వార్నింగ్‌పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. చైతన్య కృష్ణ వార్నింగ్‌పై నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్స్‌ చేస్తున్నారు.

నందమూరి ఫ్యామిలీ 2003లో వచ్చిన ‘ధమ్’ అనే సినిమాతో చైతన్యకృష్ణ హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమాలో జగపతిబాబు కూడా ఉన్నారు. ఆ తర్వాత 20 ఏళ్లకు బ్రీత్ అనే సినిమాతో హీరోగా రీ లాంచ్ అయ్యారు చైనత్య కృష్ణ. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఎంత డిజాస్టర్ అంటే టాలీవుడ్‌లోనే జీరో కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.

కాగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు చైతన్య కృష్ణ. తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు షేర్ చేస్తూ ఉంటారు. అలాగే తమను విమర్శించిన వారిపైనా చైతన్య కృష్ణ ఫైర్ అవుతూ ఉంటారు. తాజాగా చైతన్య కృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు వైసీపీ ఫ్యాన్స్ కు కలిపి వార్నింగ్ ఇచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu