నాని సినిమాలో బాహుబలి టీం..?

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘మజ్ను’ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. విరించి
డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాని, రాజమౌళి ‘బాహుబలి’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్
గా కనిపించబోతున్నారు. అయితే సినిమాలో పూర్తి స్థాయిలో తన ప్రొఫెషన్ కు సంబంధించిన
సన్నివేశాలు ఉండవట. అయితే సినిమాలో బాహుబలి టీం కనిపించబోతుందా..? అని
విలేకరి అడిగిన ప్రశ్నకు నాని సమాధానమిస్తూ.. ”కచ్చితంగా ప్రేక్షకులను ఎగ్జైట్ చేసే
రెండు సన్నివేశాలు ఉంటాయి. అవేంటో.. మీరు తెరపైన చూడాల్సిందే” అంటూ తెలిపారు.
దీంతో సినిమాలో రాజమౌళి తన బాహుబలి టీంతో కనిపించడం ఖాయమనే మాటలు
వినిపిస్తున్నాయి. ఇక కథ విషయానికొస్తే.. అందరూ అనుకున్నట్లుగా ఇది త్రికోణ
ప్రేమ కథ కాదు. ప్రేమలో ఓడిపోయిన వాడికి కూడా మంచి లైఫ్ ఉంటుందని చెప్పడమే
ముఖ్య కథాంశం.

CLICK HERE!! For the aha Latest Updates