HomeTelugu Trendingనాలుగో రోజు తగ్గిన నాని గ్యాంగ్‌ లీడర్ కలెక్షన్స్

నాలుగో రోజు తగ్గిన నాని గ్యాంగ్‌ లీడర్ కలెక్షన్స్

4 16
నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన కామెడీ థ్రిల్లర్ ‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ వీకెండ్ మంచి కలెక్షన్స్‌ రాబట్టింది. 3 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.16 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.11.8 కోట్ల షేర్ రాబట్టింది. అయితే, ఈ ఊపు నాలుగో రోజు సోమవారం కొనసాగలేదు. నాలుగో రోజు కేవలం రూ.1.18 కోట్ల షేర్ మాత్రమే వసూలైంది. దీంతో మొత్తం నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన షేర్ రూ.12.9 కోట్లుగా ఉంది. గడిచిన మూడు రోజులతో పోలిస్తే సోమవారం సుమారు 65 శాతం కలెక్షన్లు పడిపోయాయి. సాధారణంగా శుక్ర, శని, ఆదివారాలతో పోలిస్తే సోమవారం వసూళ్లు తగ్గుతాయి. కానీ ఈ సినిమా విషయంలో మరింత తగ్గాయని చెప్పొచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో గ్యాంగ్ లీడర్ థియేట్రికల్ రైట్స్‌ను రూ.20.9 కోట్లకు విక్రయించారట. ఇప్పటికే రూ.12.9 కోట్లు వసూలైందంటే, సుమారు 61 శాతం రికవరీ అయినట్టే. మిగిలిన మొత్తం రికవరీ కావడం పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే, భారీగా లాభాలు రాకపోవచ్చంటున్నారు. ఓవర్సీస్‌లో కూడా డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. అక్కడ ఈ చిత్రాన్ని రూ.5.5 కోట్లకు విక్రయించారు. ఇప్పటి వరకు రూ.3 కోట్లకు పైగా షేర్ వసూలైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu