‘జెర్సీ’ ఫస్ట్‌ లుక్‌..!

కృష్ణార్జున యుద్దం, దేవదాస్‌ లాంటి రెగ్యులర్‌ ఫార్మాట్‌ చిత్రాల ఫలితాలతో నిరాశపడ్డ హీరో నాని.. విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. నాని ప్రస్తుతం క్రికెటర్‌గా మారి స్టేడియంలో బౌండరీలు కొట్టేస్తున్నాడు. ‘మళ్లీ రావా’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి ‘జెర్సీ’ చిత్రంలో నాని క్రికెటర్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

నూతన సంవత్సరం కానుకగా జెర్సీ ‘ఫస్ట్‌లుక్‌’ను విడుదల చేసింది చిత్రయూనిట్‌. క్రికెటర్‌గా అర్జున్‌ పాత్రలో నాని నటిస్తుండగా తమిళ సంచలనం సంగీత దర్శకుడు అనిరుధ్‌ ఈ చిత్రానికి సంగీతమందించడం విశేషం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రద్దా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.