‘వెళ్లి స్నానం చేసి వస్తాను…పెళ్లి చేసుకుందాం’ అంటున్న నాని.. ‘జెర్సీ’ ట్రైలర్‌

నేచురల్‌ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా మూవీ ‘జెర్సీ’. మళ్ళీరావా ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ శ్రద్థా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఏప్రిల్ 19న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్.

ఇప్పటికే టీజర్‌తో పాటు లిరికల్‌ వీడియోలను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ హోలీ సందర్భంగా మరో ఇంట్రస్టింగ్‌ టీజర్‌ను విడుదల చేశారు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ టీజర్‌ను నాని తన సోషల్‌ మీడియా పేజ్‌ లో షేర్‌ చేశాడు. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో నాని.. క్రికెటర్‌ అర్జున్‌ పాత్రలో కనిపించనున్నాడు.