ఎన్టీఆర్ కోసం మరో టాప్ హీరోయిన్!

‘జనతా గ్యారేజ్’ సినిమా తరువాత చాలా కాలం గ్యాప్ తీసుకొని ఎన్టీఆర్, బాబీ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. కథ ప్రకారం ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నాడు. దానికి తగ్గట్లుగా ముగ్గురు హీరోయిన్లను ఎంపిక చేసే పనిలో పడ్డారు దర్శకనిర్మాతలు.

కాజల్, అనుపమ పరమేశ్వరన్, నివేదా థామస్ లను హీరోయిన్లుగా ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వారితో పాటు ఇప్పుడు మరో హీరోయిన్ ను సినిమాలో ఎంపిక చేయనున్నట్లు టాక్. బాబీ ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేశాడట. ఈ పాటలో ఓ స్టార్ హీరోయిన్ అయితే బావుంటుందనేది బాబీ ఆలోచన.

‘జనతా గ్యారేజ్’ లో కాజల్ ఐటెమ్ సాంగ్ కు ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో.. అందరికీ తెలిసిందే. సో.. బాబీ సినిమాలో పాట దాని మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఆ ఐటెమ్ భామ ఎవరో తెలియాలంటే కొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే!