
Court Telugu Movie OTT:
నాని ప్రెజెంట్ చేస్తున్న కోర్ట్ – స్టేట్ vs ఏ నొబడీ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో నాని మాట్లాడుతూ, “కోర్ట్ సినిమా నచ్చకపోతే నా హిట్ 3 చూడక్కర్లేదు” అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, సుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రల్లో నటించారు. కొత్త దర్శకుడు రామ్ జగదీశ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కోర్ట్ అనేది చాలా కొద్దిమంది ఫిల్మ్ మేకర్స్ టచ్ చేసే సబ్జెక్ట్. ముఖ్యంగా POCSO యాక్ట్ మీద కథనం ఉండడం సినిమాకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది.
కోర్ట్ సినిమా థియేటర్స్‌లో మంచి ఆదరణ పొందుతుందని అంచనా వేస్తున్నారు. అయితే థియేటర్ రన్ తర్వాత కూడా సినిమాను చూసేందుకు ఆసక్తి ఉంటే Netflix లో చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్ హక్కులను రూ. 8 కోట్లు చెల్లించి తీసుకుందట. ఒక చిన్న సినిమాకు ఇంత డీల్ దొరకడం చాలా పెద్ద విషయం.
ఈ సినిమా రేపటి నుంచే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్ల ద్వారా ప్రదర్శించనున్నారు. నాని తన సోదరి దీప్తి గంతతో కలిసి నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రశాంతి టిపిర్నేని నిర్మించారు. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గణిన్ సంగీతం అందించారు.
ALSO READ: Court: State vs Nobody సినిమా ఎలా ఉందంటే