
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న తాజా చిత్రం ”18 పేజెస్”. సుకుమార్ కథ అందించిన ఈ సినిమాకి ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ స్క్రీన్ ప్లే – దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ’18 పేజిస్’ చిత్రం నుండి ‘నన్నయ్య రాసిన’ అనే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను విడుదల చేశారు.
‘ఏ కన్నుకి ఏ స్వప్నమో.. ఏ రెప్పెలైనా తెలిపేనా.. ఏ నడకది ఏ పయనమో.. ఏ పాదమైనా చూపేనా.. నీలో స్వరాలకే నేనే సంగీతమై.. నువ్వే వదిలేసిన పాటై సాగనా..’ అంటూ సాగిన ఈ గీతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. గోపి సుందర్ సంగీతం అందించారు. సితార కృష్ణ కుమార్, పృథ్వీ చంద్ర ఈ పాటను ఆలపించారు.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్ తో కలిసి బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘కార్తికేయ-2′ వంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ తర్వాత నిఖిల్ సిద్దార్థ్ మరియు అనుపమ పరమేశ్వర్ కలిసి నటించిన సినిమా కావడంతో ’18 పేజెస్’ పై మంచి అంచనాలు నెలకొన్నాయి.













