Homeతెలుగు Newsవచ్చే ఎన్నికల్లో నారా లోకేష్‌ ఎక్కడి నుంచి పోటీ?

వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్‌ ఎక్కడి నుంచి పోటీ?

11 11
ముఖ్యమంత్రి చంద్రబాబు వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన నారా లోకేశ్ చాలా కాలంపాటు పార్టీ వ్యవహారాలే చూసుకున్నారు. 2014 ఎన్నికల్లో సైతం లోకేష్ పోటీ చేయలేదు. అయితే 2017లో లోకేశ్‌‌కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన చంద్రబాబు.. ఆ తర్వాత తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. దొడ్డిదారిన మంత్రి అయ్యారంటూ ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేశాయి. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో లోకేశ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నదానిపై తెలుగుదేశం పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది.

లోకేశ్ ఉత్తరాంధ్ర లేదా రాయలసీమ నుంచి పోటీ చేస్తారని కొద్దికాలంగా ప్రచారం సాగుతోంది. అయితే చంద్రబాబు రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో లోకేశ్ ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలని కొందరు నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రతిపాదన ఇప్పుడు పక్కకెళ్లినట్లు తెలుస్తోంది. లోకేశ్ అమరావతి ప్రాంతం నుంచే బరిలో దిగనున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. రాజధాని అమరావతికి కూతవేటు దూరంలోనే ఉన్న పెదకూరపాడు నియోజకవర్గం టీడీపీకి పెట్టని కోట. ఇక్కడ నుంచి పోటీ చేస్తే లోకేష్ ఘనవిజయం ఖాయమని పార్టీ నేతలు చెబుతుండటంతో దీనికి సంబంధించి కసరత్తు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పెదకూరపాడు ఎమ్మెల్యేగా కొమ్మలపాటి శ్రీధర్ ఉన్నారు. లోకేశ్ ఇక్కడి నుంచి పోటీచేస్తే శ్రీధర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే యోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం. అయితే అభివృద్ధి చెందుతున్న అమరావతి ప్రాంతం నుంచి కాకుండా అభివృద్ధికి దూరంగా ప్రాంతం నుంచి లోకేశ్ పోటీ చేస్తే బాగుంటుందని మరికొంతమంది నేతలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. లోకేశ్ ఉత్తరాంధ్ర నుంచి గానీ, ప్రకాశం జిల్లా నుంచి గానీ పోటీ చేయాలని ఓ వర్గం కోరుతోందట. దీనిపై లోకేశ్ ఎలా స్పందిస్తారన్న దానిపై పార్టీలో ఆసక్తి నెలకొంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu