ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్‌లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఎన్టీఆర్ 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం విస్మరణకు గురైన తీర ప్రాంత నేపథ్య కథతో తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో కనిపించనున్నారని తెలిసింది. అది కూడా తండ్రీ కొడుకులుగా. ఫ్లాష్ బ్యాక్‌లో తండ్రీ పాత్ర కనిపిస్తుందని టాక్.
జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్- కొరటాల కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో హరికృష్ణ.కె. సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5, 2024లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు