HomeTelugu Trendingఓటీటీలో 'నారప్ప' వచ్చేది అప్పుడేనా!

ఓటీటీలో ‘నారప్ప’ వచ్చేది అప్పుడేనా!

Narappa in OTT

టాలీవుడ్‌ హీరో వెంకటేశ్‌ నటించిన చిత్రం ‘నారప్ప’. ఇప్పటికే షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ చిత్రం మే 14న విడుదల కావల్సి ఉంది అయితే కరోనా సెకండ్‌వేవ్‌ కారణంగా వాయిదా పడింది. అయితే ‘నారప్ప’ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్‌ చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు ఎన్నో రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌కు ‘నారప్ప’ టీమ్‌తో డీల్‌ కుదిరిందని తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

వచ్చే నెలలో అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ‘నారప్ప’ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. జులై 24న ఈ సినిమా విడుదల కావొచ్చని అనుకుంటున్నారు. అయితే, ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. శ్రీకాంత్‌ అడ్డాల డైరెక్షన్‌లో వహించిన ఈ సినిమాలో వెంకటేశ్‌ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో వెంకటేష్‌కి జోడిగా ప్రియమణి నటించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu