HomeTelugu Trendingనవదీప్‌ ఇంట్లో నార్కోటిక్ పోలీసుల సోదాలు

నవదీప్‌ ఇంట్లో నార్కోటిక్ పోలీసుల సోదాలు

Navadeep drug case update

హైదరాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారం మరోసారి టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నవదీప్‌ను డ్రగ్స్ వినియోగదారుడిగా పోలీసులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నవదీప్‌ ఇంట్లో తెలంగాణ నార్కోటిక్ పోలీసులు సోదాలు నిర్వహించారు.

గత నెల 31న మాదాపూర్‌లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్స్‌లో డ్రగ్స్ పార్టీ జరిగింది. పోలీసుల రైడింగ్ చేసి 13 మందిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో పట్టుబడ్డ రామ్ చంద్ అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలంలో నవదీప్ పేరు బయటకు వచ్చింది. అందుకే ఈ కేసులో నవదీప్‌ను తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు నిందితుడిగా చేర్చారు.

ఈ నెల 16న నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు సోదాలు నిర్వహించిన సమయంలో నవదీప్ ఇంట్లో లేడని సమాచారం. మరోవైపు తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని టీఎస్ హైకోర్టును నవదీప్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హైకోర్టులో నవదీప్‌కు కాస్త ఊరట లభించింది. మంగళవారం వరకు నవదీప్‌ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu