స్టార్ హీరోల సినిమాలకు నో బోర్డ్!

నయనతార ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్ధ కాలం దాటుతున్నా.. అమ్మడు క్రేజ్ మాత్రం అసలు తగ్గలేదు. పైగా రోజురోజుకి పెరుగుతోంది. స్టార్ హీరోలందరు తమ సినిమాల్లో హీరోయిన్ గా నయన్ ను తీసుకోవాలనుకుంటున్నారు. అయితే ఇకపై స్టార్ హీరోల సినిమాల్లో నటించననే నిర్ణయం తీసుకొని అందరి హీరోలకు షాక్ ఇస్తోంది ఈ బ్యూటీ.

బాలకృష్ణ, చిరంజీవి, పవన్ కల్యాణ్ వంటి హీరోలకు నో చెప్తూ.. శివకార్తికేయన్, విజయ్ సేతుపతి, అధర్వ వంటి అప్ కమింగ్ యంగ్ హీరోల సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపుతోంది. దీనికో కారణం కూడా చెబుతోంది..

పెద్ద హీరోల సినిమాలు అయితే కేవలం డాన్స్ లు, పాటలకు మాత్రమే తనను వాడుకుంటున్నారని, తన పాత్రకు విలువ లేకుండా పోతుందని.. అదే చిన్న హీరోల సినిమాల్లో అయితే కథ తన పాత్ర చుట్టూనే తిరుగుతుందని, నటిగా తనకు మంచి పేరు వస్తోందని అందుకే స్టార్ హీరోల సినిమాలకు ఏదొక వంక చెబుతూ.. తప్పించుకుంటోందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here