HomeTelugu Trendingపెళ్లి తర్వాత జవాన్ షూటింగ్‌లో నయనతార!

పెళ్లి తర్వాత జవాన్ షూటింగ్‌లో నయనతార!

Nayanatara in jawan shootin
నయనతార బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. షారుక్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటిస్తోంది. కోలీవుడ్‌ డైరెక్టర్‌ అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. నయనతార హానీమూన్‌ నుంచి తిరిగొచ్చిన వెంటనే షూటింగ్‌ కోసం ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది. నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ తాజాగా వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.

జూన్‌ 9న తమిళనాడులోని మహాబలిపురంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నూతన దంపతులు తిరుమల క్షేత్రానికి సైతం వెళ్లి వచ్చారు. థాయ్‌లాండ్‌కు హనీమూన్‌ ట్రిప్ ముగించుకుని వచ్చారు. హానీమూన్‌ నుంచి రాగానే నయనతార షూటింగ్‌ సెట్‌లో అడుగు పెట్టింది. జవాన్‌ షూటింగ్‌లో పాల్గొని సందడి చేసినట్లు చెప్తున్నారు. నయన్ కొన్ని రోజుల వరకూ షూటింగులకు హాజరు కాకపోవచ్చని, ఒప్పుకున్న ప్రాజెక్ట్స్‌కు సైతం కొత్త కండిషన్స్‌ పెడుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో జవాన్ షూటింగ్‌లో పాల్గొని నయనతార వార్తల్లో నిలిచింది. తెలుగులో చిరంజీవి సరసన గాడ్‌ఫాదర్‌ మూవీలో నటిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu