అక్టోబర్ మొదటి వారంలో ‘నీ జతలేక’!

ప్రముఖ వ్యాపారవేత్త జి.వి. చౌదరి శ్రీ సత్యవిదుర మూవీస్‌ బ్యానర్‌ను స్ధాపించి తొలి ప్రయత్నంగా యంగ్‌ సక్సెస్‌ఫుల్‌ హీరో నాగశౌర్యతో ‘నీ జతలేక’ చిత్రాన్ని నిర్మించారు. పారుల్‌ గులాటి మీరోయిన్‌గా లారెన్స్‌ దాసరి దర్శకత్వంలో జి.వి. చౌదరి, నాగరాజుగౌడ్‌ చిర్రా సంయుక్తంగా రూపొందించిన ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 1న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా….
నిర్మాత జి.వి. చౌదరి మాట్లాడుతూ.. ”ఇప్పటి వరకు ఎన్నో ప్రేమకథలు వచ్చాయి. కానీ మా చిత్రంలోని ప్రేమ కథ చాలా కొత్తగా ఉంటుంది. ఇలాంటి కథ స్క్రీన్‌పై రావడం ఇదే ఫస్ట్‌టైమ్‌. ఈ చిత్రం టైటిల్‌ కథకి పర్‌ఫెక్ట్‌ యాప్ట్‌. ఇప్పటివరకు నాగశౌర్య చేసిన చిత్రాలన్నింటికంటే ఈ చిత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రతి సీన్‌ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. లారెన్స్‌ దాసరి కథ చెప్పిన దానికంటే సినిమా బాగా తీశాడు.175 థియేటర్లుకు పైగా అక్టోబర్‌ 1న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం” అన్నారు.
నిర్మాత నాగరాజు గౌడ్‌ చిర్రా మాట్లాడుతూ.. ”ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌ అయ్యేలా ‘నీ జతలేక’ చిత్రాన్ని నిర్మించాం. చాలా స్టైలిష్‌గా వుంటుంది. సాంగ్స్‌ పిక్చరైజేషన్‌ అద్భుతం. ప్రతి సీన్‌ చాలా ఫ్రెష్‌గా వుంటుంది. నాగ శౌర్య ఈ చిత్రంలో న్యూ లుక్‌లో కనబడతాడు. దాసరి లారెన్స్‌ సినిమాని చాలా బాగా తెరకెక్కించారు. అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ వున్నాయి” అన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates