HomeTelugu Trendingరవితేజా హీరోయిన్‌కు అరుదైన సమస్య

రవితేజా హీరోయిన్‌కు అరుదైన సమస్య

Nela ticket Heroine Malvika

టాలీవుడ్‌లో రవితేజా ‘నేల టిక్కెట్‌’ సినిమాలో హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్న బ్యూటీ మాళవికా శర్మ. ప్రస్తుతం ఈ అమ్మడు రామ్ హీరోగా తెరకెక్కుతున్న రెడ్‌ సినిమాలో కూడా చాన్స్ కొట్టేసింది. ఈ సినిమా పూర్తకాకముందే ఈ ఆమెకు మరో రెండు ఆఫర్లు లైన్‌లో ఉన్నాయి. వచ్చే వేసవిలోపు మరో రెండు తెలుగు సినిమాల్లో మాళవికా చేయనుంది. తరుచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాళవికా ఇటీవల ఫాన్స్‌కు గుండె పగిలే నిజాన్ని ఎంతో సింపుల్‌గా నవ్వుతూ చెప్పేసింది. ఆమె మానసిక రుగ్మత గురించి అభిమానులకు తెలిపింది. దీంతో ఆమె అభిమానులు ఆశ్యర్యపోయారు. ఈ ముద్దుగుమ్మ క్లెప్లమెనియాక్ అనే చిత్రమైన మానసిక సమస్యతో బాధపడుతోందట.ఈ సమస్య ఉన్న వారికి చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి పెద్ద పెద్ద దొంగతనాలు చేయాలని అనిపిస్తుందట. ఏదైనా వస్తువు కళ్ల ముందు కనిపిస్తే చాలు దాన్ని దొంగతనం చేయాలని అనిపిస్తుందట. ఇది చాలా అరుదుగా ఉంటుంది. అది ఒక హీరోయిన్‌కు ఇది ఉండటం చిన్న విషయం కాదు. ఈ సమస్య కారణంగా తాను ఎన్నోసార్లు ఇబ్బంది పడ్డానని మాళవిక చెప్పింది. తన వెంట ఎవరైన ఉండి ఎప్పటికప్పుడు తన మనసును పక్క దారి పట్టిస్తూ ఉండటంతో పాటు తన మానసిక స్థితిని గుర్తు చేస్తుంటారని ఈ బ్యూటీ చెప్పింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu