HomeTelugu Trendingనేనే నా..? ఫస్ట్‌ లుక్‌ విడుదల

నేనే నా..? ఫస్ట్‌ లుక్‌ విడుదల

8 2
ఎస్‌ఎమ్‌ఎస్‌ మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన చెన్నై బ్యూటీ రెజీనా కసండ్ర. తెలుగుతో పాటు తమిళం, హిందీ వంటి పలు భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నారు. అయితే పలు హిట్‌ చిత్రాల్లో నటించినప్పటికీ రెజీనాకు సరైన గుర్తింపు దక్కలేదు. గతేడాది ‘ఎవరు’ చిత్రంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. తెలుగులో సరైన అవకాశాలు లేనప్పటికీ తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం నేనే నా..? అనే చిత్రంలో రెజీనా ప్రధాన పాత్రలో నటిస్తోంది.

మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణం జరుపుకుంటోంది. ‘నిను వీడని నీడను నేనే’ డైరెక్టర్‌ కార్తీక్‌ రాజు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రెజీనా ఆర్కియాలజిస్ట్‌గా కనిపించనుంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ విడుదల చేశారు. కట్టు బొట్టుతో రాణిలా కనిపిస్తున్న రెజీనా పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మరోవైపు తమిళ ఫస్ట్‌ పోస్టర్‌ను విజయ్‌ సేతుపతి ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. తమిళంలో ఈ చిత్రానికి శూర్పణగై అనే టైటిల్ పెట్టారు. అంటే, తెలుగులో శూర్పణఖ అని అర్థం. రాజశేఖర్‌ వర్మ నిర్మిస్తున్న ఈ సినిమాకు సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu