నాని ఆటిట్యూడ్ ఈజ్ ఎవ్రిథింగ్!

`ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం`, `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌`, `కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌`, `జెంటిల్ మ‌న్‌`, మ‌జ్ను`..వ‌రుస ఐదు చిత్రాల స‌క్సెస్‌తో ప్రేక్ష‌కుల్లో  మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్‌గా , హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో  “సినిమా చూపిస్తా మామా” చిత్రానికి దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రినాథ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `నేను లోక‌ల్‌`.”ఆటిట్యూడ్ ఐస్ ఎవిరీథింగ్‌…క్యాప్ష‌న్‌. ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. దీపావ‌ళి సంద‌ర్బంగా సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు.
 
ఈ సంద‌ర్భంగా…
చిత్ర స‌మ‌ర్ప‌కుడు దిల్ రాజు మాట్లాడుతూ – “ఎప్ప‌టి నుండో నానితో ఓ సినిమా చేయాల‌నుకుంటున్నాను. `నేను లోక‌ల్‌` సినిమాతో కుదిరింది. త్రినాథ‌రావు న‌క్కిన చెప్పిన క‌థ చాలా బాగా న‌చ్చింది. త్రినాథ్ స్టైల్ ఆప్ ఎంట‌ర్‌టైన్మెంట్‌తో ఎన‌ర్జీ ఉన్న క్యారెక్ట‌ర్ బేస్డ్ ల‌వ్‌స్టోరీగా` నేను లోక‌ల్` సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. రాక్‌స్టార్ దేవిశ్రీప్ర‌సాద్‌కు, మా వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌కు ఉన్న రిలేష‌న్ తెలిసిందే. మా బ్యాన‌ర్‌లో ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌కు సంగీతాన్ని అందించిన దేవిశ్రీ అందించిన మ్యూజిక్ హైలైట్‌గా నిలుస్తుంది. హీరోగా సినిమాలు చేస్తోన్న నవీన్ చంద్ర ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేయటానికి ఒప్పుకున్నందుకు చాలా థాంక్స్. దీపావ‌ళి సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేస్తున్నాం. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను క్రిస్మ‌స్ సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. ఇప్ప‌టికే ఐదు వ‌రుస స‌క్సెస్‌లు కొట్టిన నాని మా బ్యాన‌ర్‌లో విడుద‌ల‌వుతున్న `నేను లోక‌ల్‌`తో సెకండ్ హ్యాట్రిక్ పూర్తిచేస్తాడ‌నే న‌మ్మ‌కంగా ఉన్నాం. నాని కెరీర్‌లో ఈ చిత్రంలో ఓ డిఫరెంట్ మూవీగా నిలుస్తుంది“ అన్నారు.
 
CLICK HERE!! For the aha Latest Updates