నో బ్రేక్‌ అంటున్న బాలయ్య!

ప్రస్తుతం బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. వరుస సినిమాల్ని ట్రాక్లో పెడుతున్నాడు బాలయ్య. ఆయన పనిచేయనున్నదర్శకుల్లో సీనియర్ స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ కూడ ఒకరు. ఫిబ్రవరి నాటికి ‘ఎన్టీఆర్’ బయోపిక్‌ చిత్రీకరణను పూర్తిచేసి విరామం తీసుకోకుండా అదే నెలలో వినాయక్ సినిమాను మొదలుపెడతాడట బాలయ్య.

ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకురానున్నాయి. 2002లో ‘చెన్నకేశవ రెడ్డి’ సినిమాకు కలిసి పనిచేసిన ఈ ఇద్దరూ మళ్ళీ 16 ఏళ్ల తరవాత ఈ సినిమా కోసం చేతులు కలిపారు.