నాని సినిమా వాయిదా పడుతుందా..?

ఈసారి రామ్ చరణ్ చాలా మంది హీరోలను ఇబ్బంది పెట్టేస్తున్నాడు. తను నటించిన ‘దృవ’ సినిమా డిసంబర్ 9న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా చరణ్ కెరీర్ కు ఎంతో కీలకం. భారీ కలెక్షన్స్ ను టార్గెట్ చేస్తున్నాడు. అందుకే ఈ సినిమాకు పోటీగా మరో సినిమా రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే డిసంబర్ 16న రావాల్సిన సూర్య సింగం3 డిసంబర్ 23కి వాయిదా పడింది.

ఇప్పుడు చరణ్ ఎఫెక్ట్ నాని కి బాగా పడుతోందని టాక్. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసి ఎప్పటినుండో డిసంబర్ 23న రిలీజ్ డేట్ అని అనౌన్స్ చేసిన ‘నేను లోకల్’ సినిమా ఇప్పుడు వాయిదా పడేలా కనిపిస్తోంది. నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దింపాలని ఆలోచిస్తున్నాడట. ఫైనల్ గా ‘నేను లోకల్’ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!