
Pawan Kalyan OG rights:
Pawan Kalyan OG (They Call Him OG) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పవన్ కెరీర్‌లో ప్రత్యేక స్థానం దక్కించుకోనుంది. రాజకీయం పైనే ఎక్కువగా దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్‌కు, ఈ సినిమా కమ్ బ్యాక్ చిత్రం లాగా కనిపిస్తోంది.
OG చిత్రంపై అభిమానులకు మరో మంచి వార్త వినిపించింది. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రానికి హక్కులు తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించింది.
“OG బ్యాక్! థియేటర్‌లో విడుదల తర్వాత OG నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.” అంటూ నెట్‌ఫ్లిక్స్ ట్వీట్ చేసింది.
ఓజీ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సుమారు 90-100 కోట్ల రూపాయలు చెల్లించి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ ధర తారాస్థాయిలో ఉండటంతో, OG సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది.
OG సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ నటిస్తున్నారు. సంగీతాన్ని థమన్ అందిస్తున్నారు. DVV దానయ్య ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
అసలైతే ఈ సినిమాను 2024 సెప్టెంబర్ 27న విడుదల చేయాలని భావించినా, పలు కారణాల వల్ల వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం, OG చిత్రాన్ని ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.













