‘నెక్స్ట్ఏంటి’ ట్రైలర్‌

బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ తెలుగులో తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నెక్స్ట్ఏంటి’. ఈ చిత్రంలో సందీప్‌ కిషన్ హీరో, తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం ట్రైలర్‌ను యూనిట్ విడుదల చేసింది. నవదీప్‌, పూనమ్‌ కౌర్‌ ఇందులో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. అబ్బాయి-అమ్మాయికి మధ్య ప్రేమ, ఆకర్షణ తదితర విషయాలను ఇందులో ప్రస్తావించారు.