HomeTelugu Big Storiesతనను విమర్శించిన వ్యక్తి పై విరుచుకుపడ్డ హీరోయిన్‌

తనను విమర్శించిన వ్యక్తి పై విరుచుకుపడ్డ హీరోయిన్‌

9 21సోషల్‌ మీడియా విస్తృతి పెరగటంతో చాలా మంది సినీ సెలెబ్రిటీలు ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. తమ అభిమాన హీరో, హీరోయిన్‌లను ఎంత పొగుడుతున్నారో.. అంతే స్థాయిలో అభిమానులు, సోషల్‌ మీడియా యూజర్లు సామాజిక మాధ్యమాల్లో విమర్శిస్తున్నారు. అయితే చాలా మంది సెలెబ్రిటీలు సోషల్‌ మీడియాలో వచ్చే ట్రోలింగ్‌, కామెంట్లను చూసిచూడనట్టు దూరంగా ఉంటారు. మరికొంత మంది పిచ్చిపిచ్చిగా రాసే రాతలకు ఘాటుకు స్పందిస్తారు. తాజాగా బాలీవుడ్‌ నటీ నియాశర్మ తనపై అసభ్యంగా వ్యాఖ్యలు చేసినవారిపై మండిపడ్డారు. నియా శర్మపై ‘తన పీఆర్‌ టీం సాయంతో సంతోషంగా కెరీర్‌ ముందుకు వెళ్తున్నట్టు ట్విటర్‌లో రూమర్లు వచ్చాయి. దీనిపై ఓ ఆకతాయి ట్విటర్‌ యూజర్‌ నియాపై అసభ్యంగా వ్యాఖ్యలు చేశాడు. ‘నియా చూడటానికి చాలా అసహ్యంగా ఉంటారని.. భూమిమీద సెలబ్రిటీగా అని పిలువబడే వికారంగా ఉన్నవారిలో ‘నియా శర్మ’ ఒకరని కామెంట్‌ చేశాడు.

ఎటువంటి కారణం, అందం లేకుండా.. నియా వార్తల్లో ఉండటానికి కారణం ఆమె పీఆర్‌ టీం గొప్పతనం అన్నాడు. ఆసియాలోనే చాలా ఆకర్షణీయంగా కనిపించే మహిళలల్లో నియా ఒకరిగా పరిగణించబడుతున్నారన్న విషయం తెలిసిందే. అటువంటి నియా దీనిపై స్పందిస్తూ.. ‘ఆ వ్యక్తికి ఇలా కామెంట్‌ చేయడానికి అతనికి కనీసం సిగ్గు కూడా లేదని మండిపడ్డారు. అదే విధంగా తనకు ఎటువంటి పీఆర్‌ టీం లేదని.. తాను చాలా సహజంగా ఉంటాను’ అని తెలిపారు.

తన అభిమానులు, స్నేహితులు…నియాకు మద్దతుగా నిలిచారు. సదరు వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ‘బహుశా మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని.. నటీగా ఉండటానికి, ఆ స్థాయికి చేరుకోవడానికి తాను ఎంత కష్టపడి ఉంటారో మీరు ఊహించలేరు’ అని బిగ్‌బాస్‌ ఫేం బండ్గి కల్రా ట్వీట్‌ చేశారు. ఇలా నియా ఒక్కరే కాదు.. బాలీవుడ్‌లో చాలా మంది సెలెబ్రిటీలు సోషల్‌ మీడియాలో ఎటువంటి కారణం లేకుండానే తీవ్రంగా ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!