ఉదయ్ చావుకి ఆ ఆర్టికల్ కారణమా..?

టాలీవుడ్ లో లవర్ ఇమేజ్ ను సంపాదించుకొని వరుస హిట్స్ తో అతి తక్కువ సమయంలో
స్టార్ హీరోగా ఎదిగాడు ఉదయ్ కిరణ్. అయితే ఆ తరువాత వరుస ఎదురుదెబ్బలు తగలడంతో
తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆయన తనువు చాలించి ఇప్పటికీ మూడేళ్లు
గడిచిపోయాయి. అయితే ఉదయ్ చావు గురించి ఆయన మిత్రుడు అల్లరి నరేశ్ ఓ కామెంట్
చేశాడు. ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు రోజు నరేశ్ ను కలిశాడట. ఆ సమయంలో ఉదయ్
ఎంతో బాధగా కనిపించినట్లు నరేశ్ వెల్లడించాడు. కారణం అడగగా.. పేపర్ లో వచ్చిన ఆర్టికల్
లో యువ హీరో కథలు సరిగ్గా ఎన్నుకోవట్లేదని రాసి ఉన్నట్లు చెప్పాడట ఉదయ్. దానికి
అంత బాధ పడాలా.. నీకు సంబంధించింది కాదు కదా అని అడగ్గా.. వేరే హీరో అయినా.. స్టోరీ
సెలెక్షన్ లో మార్పు రాకపోతే తనకు పట్టిన గతే పడుతుందని ఉదాహరణగా చెప్పి బాధ
పడ్డాడట. బాధల్లో ఉన్న అతడిని ఆ ఆర్టికల్ మరింత మనస్తాపానికి గురి చేసిందని, తన మరణానికి
అది కూడా ఓ కారణం కావొచ్చని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here