HomeTelugu Newsఅప్పుడే దానిపై దృష్టి పెట్టేసిన నిధి అగర్వాల్‌!

అప్పుడే దానిపై దృష్టి పెట్టేసిన నిధి అగర్వాల్‌!

11a
డైరెక్టర్ పూరీజగన్నాద్ చాలా రోజులతర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా సాలిడ్ హిట్ అందుకున్నాడు. రామ్ హీరోగా నటించిన ఈసినిమాలో నిధి అగార్వల్, నబానటేష్ హీరోయిన్‌లుగా నటించారు. ఈ ఇద్దరు భామల్లో నబానటేష్ అవకాశాలు దక్కించుకుంటుండగా.. నిధి అగార్వాల్‌కి మాత్రం అవకాశాలు పెద్దగా రావడం లేదు. అయితే ప్రస్తుతం లాక్డౌన్ సమయంలో నిధి అగర్వాల్ ఆన్‌లైన్ కోర్సు నేర్చుకుంటుందట. నటనలో మరింత ప్రావీణ్యం సంపాదించడానికి ఆన్ లైన్ కోర్సును ఎంచుకుని రెగ్యులర్ గా క్లాసెస్ వింటుంది.

నటనలోనే కాకుండా స్క్రిప్టు ఎలా రాయాలో, డైరెక్షన్ ఎలా చేయాలో కూడా నేర్చుకుంటుందట ఈ హాట్‌ బ్యూటీ. హీరోయిన్ గా కెరీర్ ఉండేది తక్కువ రోజులే అన్న ఉద్దేశ్యంతో.. ఆమె సినిమాలోని మరిన్ని క్రాఫ్ట్ ల మీద దృష్టి పెడుతుంది. అంటే రానున్న రోజులలో నిధి అగర్వాల్‌ని మనం దర్శకురాలిగా చూసే అవకాశం ఉందన్నమాట. కాగా ఈ అమ్మడు ప్రస్తుతం మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఫస్ట్‌ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా మినహా మారో ఆఫర్ అమ్మడి చేతిలో ఉన్నట్లు సమాచారం లేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu