HomeTelugu Trendingమంచు మనోజ్‌ సినిమాలో నిహారిక

మంచు మనోజ్‌ సినిమాలో నిహారిక

niharika in manchu manoj wh
మంచు మనోజ్‌ హీరోగా నటిస్తున్న తాజా ప్రాజెక్ట్‌ ‘వాట్ ది ఫిష్’. మనం మనం బరంపురం.. అనేది క్యాప్షన్‌. వరుణ్‌ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అనౌన్స్‌ మెంట్‌ పోస్టర్‌ లాంఛ్ చేసి చాలా రోజుల క్రితమే తన ఫాలోవర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పాడు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించారు మూవీ టీమ్‌‌. మెగా డాటర్‌ నిహారిక కొణిదెల ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. డాలర్‌ బ్యాక్‌డ్రాప్‌లో మెస్మరైజింగ్‌ వాక్‌తో వస్తున్న విజువల్స్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో నిహారిక నటనకు ఆస్కారమున్న యాక్షన్‌ ప్యాక్‌డ్‌ రోల్‌లో అష్ణలక్ష్మి (ఏఎస్‌హెచ్‌) పాత్రలో సరికొత్త అవతారంలో కనిపించబోతుంది.

6ix సినిమాస్‌ బ్యానర్‌పై విశాల్‌ బెజవాడ, సూర్య బెజవాడ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. శక్తికాంత్‌ కార్తీక్‌ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. మంచు మనోజ్‌ మరోవైపు ‘అహం బ్రహ్మాస్మి’ సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడితో చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu