రాజకీయాల్లోకి వస్తానంటున్న.. వరలక్ష్మి శరత్ కుమార్‌!

‘పందెంకోడి-2’ సినిమాలో విలన్ క్యారెక్టర్‌‌లో మెరిసిన వరలక్ష్మి శరత్ కుమార్.. తన నటనతో తెలుగు వారిని బాగానే ఆకట్టుకుంది. వరలక్ష్మి ఇంతకు ముందు విజయ్ సర్కార్ సినిమాలోను..పలు తమిళ సినిమాల్లో కూడా హీరోయిన్‌గా చేసింది. ప్రస్తుతం హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో లేడీ విలన్‌గా అదరగొడుతుంది. అందులో భాగంగా ఆమె విశాల్ పందెంకోడి 2లో విలన్‌‌‌‌గా చేసింది తెలిసిందే. అంతేకాకుండా.. ఆమె ‘కన్నిరాశి’, ‘వెల్వట్‌ నగరం’, ‘నీయా 2’, ‘కాట్టేరి’, తెలుగులో ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌’ చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఆమె తాజా నిర్ణయం తమిళ ప్రేక్షకుల్నీ షాక్ గురిచేసింది. వరలక్ష్మి ఈ మధ్య ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందనీ…అందులో భాగంగా ‘రాజకీయాలపై ఆసక్తి పెంచుకుంటున్నానని… మంచి అవగాహన వచ్చాకా..రాజకీయాలు భాగా నేర్చుకున్న తర్వాత మంచి సమయంలో తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాను అని తెలిపింది. ఇంకా ఆమె మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాలను సరైన విధంగా వినియోగించుకోవాలి. రాజకీయాలంటే ఏదో చెడ్డ విషయం కాదు. ప్రజలకు మేలు చేయగలిగే ఓ చక్కని వేదిక. ఇప్పుడున్న పరిస్థితుల్లో విప్లవం చాలా ముఖ్యం. ప్రస్తుతానికి మా నాన్న నడుపుతున్నా రాజకీయ పార్టీకి, నాకు ఎలాంటి సంబంధం లేదని’ అని అన్నారు.