ట్రోల్ చేసిన నెటిజన్లు.. నిహారిక అదిరిపోయే కౌంటర్‌!

సెలబ్రెటిలతో నెటిజ‌న్లు ఆడుకోవ‌డం కామన్‌ అయిపోయింది. ముఖ్యంగా హీరోయిన్ల‌తో. వాళ్లేం పోస్టులు పెట్టినా.. మాట్లాడినా కూడా తెగ ఆడుకుంటారు నెటిజ‌న్లు. ఇక ఇప్పుడు ఇదే విష‌యం నిహారిక విష‌యంలో కూడా జ‌రిగింది. ఈ విషయాన్ని మెగా డాట‌ర్ కూడా చాలా సీరియ‌స్‌గా తీసుకుంది. త‌న‌ను ట్రోల్ చేసిన వాళ్ల‌కు అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చింది నిహారిక‌. ఈ మ‌ధ్య కాలంలో ఎక్క‌డికి వ‌చ్చినా.. ఎవ‌రూ.. మాట్లాడినా తెలుగులో కాకుండా ఇంగ్లీష్‌లోనే ఎక్కువ‌గా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా సినిమా వాళ్లు ఎక్క‌డికి వ‌చ్చినా ఇంగ్లీష్‌లోనే స్వీచ్‌ ఇస్తారు.

దీనిపై చాలా మందికి చాలా సార్లు కౌంట‌ర్లు కూడా పడ్డాయి. ఇప్పుడు నిహారికకు కూడా ఇలాంటి చేదు అనుభ‌వ‌మే ఎదురైంది. దాంతో ఈ భామ కూడా కౌంట‌ర్ ఇచ్చింది. ఎందుకు మీరు ఎక్క‌డికి వ‌చ్చినా కూడా ఇంగ్లీషులో ఎక్కువ‌గా మాట్లాడుతున్నారు.. కార‌ణ‌మేంటి.. ఎందుకు అలా మాట్లాడుతున్నారు అంటూ ఓ అభిమాని అడిగాడు. దీనికి నిహారిక కూడా అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చింది. ఇంగ్లీష్ అనేది కేవ‌లం మ‌న‌కు అవ‌స‌రం మాత్ర‌మే.. జీవితం కాదు క‌దా అని చెప్పింది నిహారిక‌.

అంత‌టితో ఆగ‌కుండా మ‌న‌కు తెలుగు వచ్చినా కూడా ఒక్కోసారి అందరికి అర్థ‌మ‌య్యే భాష‌లో ఓ విష‌యం చెప్పాల‌న్నా.. మ‌నం మాట్లాడుతుంది అంద‌రికీ కనెక్ట్ కావలంటే.. త‌ప్ప‌ద‌ని తెలిసినా యూనివర్సల్ భాషలోనే మాట్లాడాల్సి వ‌స్తుంది. ఆ స‌మ‌యానికి అది అవ‌స‌రం.. అలా చేసిన‌పుడే మ‌నం స‌క్సెస్ అవుతామ‌ని స‌మాధానం చెప్పింది మెగా డాట‌ర్‌. ఒక‌వేళ త‌న తెలుగు వినాల‌నుకుంటే హలో యాప్ ఫాలో అయిపోమ‌ని అభిమానుల‌కు స‌ల‌హా ఇచ్చింది నిహారిక. ప్ర‌స్తుతం సూర్య‌కాంతం సినిమాతో పాటు సైరా సినిమాలో కూడా కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది నిహారిక కొణిదెల‌.