సుకుమార్‌తో నిహారిక సినిమా..!

రామ్‌ చరణ్‌ నటించిన ‘రంగస్థలం’ సినిమా తరువాత సుకుమార్ మరో సినిమాకు కమిట్ కాలేదు. మహేష్ బాబుతో తరువాత సినిమా చేయాలి. కథ పరంగా ఇప్పటి వరకు ఫైనల్ కాకపోవడంతో సుకుమార్ వేరే కథలతో బిజీ అయ్యాడు. సుకుమార్ సొంతంగా సుకుమార్ రైటర్స్ అనే సంస్థను స్థాపించి.. సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తన దగ్గర పనిచేసిన శిష్యులను దర్శకులుగా పరిచయం చేస్తూ.. సుకుమార్ సినిమాలు చేస్తున్నాడు.

సుకుమార్.. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి రెండు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. దీంతోపాటు కొణిదెల హీరోయిన్ నిహారికతో ఓ సినిమా చేసేందుకు సుకుమార్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. నిహారిక హీరోయిన్ గా ఓ లేడీ ఓరియంటెడ్ కథను తెరకెక్కించబోతున్నారట. సుకుమార్ శిష్యులలో ఒకరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. సుకుమార్ రైటర్స్, గీతా ఆర్ట్స్, అంజనా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయట. ప్రస్తుతం నిహారిక సూర్యకాంతం సినిమా చేస్తున్నది. ఈ సినిమా మార్చి 29 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.

CLICK HERE!! For the aha Latest Updates