HomeTelugu Trending'హ్యాపీ బర్త్‌ డే లవ్‌’ : నిహారిక

‘హ్యాపీ బర్త్‌ డే లవ్‌’ : నిహారిక

Niharika special wishes to 1 1

టాలీవుడ్‌ ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఒకరి తర్వాత మరొకరు వరుసగా పెళ్లి పీఠలు ఎక్కుతున్నారు. కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో తమ వివాహాలను కానేచ్చే పనిలో పడ్డారు. ఇక త్వరలో మెగా డాటర్ నిహారిక కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. జొన్నలగడ్డ చైతన్యతో తన వివాహం జరగబోతున్నట్లు ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే చైతన్య బర్త్‌ డే సందర్భంగా శుభాకాంక్షలు చెప్పింది నిహారిక. కాబోయేవాడితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ .. ‘ఒక నవ్వు.. గది మొత్తం వెలుగులు నింపుతుంది, ఇంట్లో ఉన్న అనుభూతి కలిగేలా కౌగిలించుకుంటుంది. నవ్వు నా సంతోషపు చిరునామా చై. ఇది కేవలం మొదటిది మాత్రమే…ఇంకా చాలా ఉన్నాయి. అన్నింటిల్లో నువ్వు ఉత్తమమైనవాడివి. ‘హ్యాపీ బర్త్‌ డే లవ్‌’ అని నిహారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . నిహారిక పోస్ట్‌పై స్పందించిన చైతన్య.. నిహారికకు థ్యాంక్స్‌ చెప్పారు. ‘థ్యాంక్స్‌ నిహా.. జస్ట్‌ మేడ్‌ మై డే అగేన్‌’ అని కామెంట్‌ చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!