HomeTelugu Big Storiesవిజయ్‌ దేవరకొండ పాట వివాదం

విజయ్‌ దేవరకొండ పాట వివాదం

అర్జున్‌ రెడ్డి చిత్రంతో యూత్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న హీరో విజయ్‌ దేవరకొండ. ఇతను తాజాగా నటిస్తున్న చిత్రం గీతా గోవిందం. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్‌ అయిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. రిఫ్రెష్‌మెంట్‌ యూత్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందన్న అంచనాలను దర్శకుడు పరుశురాం(బుజ్జి) అందించాడు. పైగా గీతా ఆర్ట్స బ్యానర్‌ కావటంతో ఫ్యామిలీ సెక్షన్‌ ఆడియాన్స్‌ ను సైతం మెప్పించే విధంగా ఈ చిత్రం ఉంటుందన్న టాక్‌ వినిపించింది. అయితే ఇటీవలే ఈ చిత్రం నుంచి రిలీజ్‌ అయిన ‘వాట్‌ ద ఎఫ్‌ సాంగ్‌’ తో ఒక్కసారిగా సీన్‌ మారిపోయింది.

1 29

ఈ పాలను విజయ్‌ దేవరకొండే స్వయంగా పాడిన ఈ పాటలో అభ్యంతరకర పదాలు ఉన్నాయంటూ పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. పురాణాల ప్రస్తావన తెస్తూ సాగిన కొన్ని సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికితోడు సోషల్‌ మీడియాలో సైతం విపరీతంగా ట్రోల్‌ కావటంతో యూట్యూబ్‌ నుంచి చివరకు ఆ పాటను తీసేశారు. అయితే ఈ పాటపై రచయిత శ్రీ మణి క్షమాపణలు తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

తెలుగు ప్రజలందరికీ నమస్సుమాజంలి. ఈ రోజు విడుదలైన గీత గోవిందం లో ‘అమెరికా గాళ్‌ అయినా.. ‘అనే పాటలోని కొన్ని వాక్యలు కొంత మంది మనోభావాలను గాయపరిచాయని విమర్శలు రావటం జరిగింది. కానీ, మా భావనని తప్పుగా అర్థం చేసుకోవటం జరిగింది. ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశ్యం మాకు లేదు.. అందువల్లన ఈ పాటలోని అభ్యంతరకర పదాలను తొలగించి తిరిగి రచించిన ఈ పాటను యూ ట్యూబ్‌లో తిరిగి అప్‌ లోడ్‌ చేస్తామని తెలిజేస్తున్నాం’ అని శ్రీ మణి పేర్కొన్నారు. కాగా ఈ చిత్రం ఆగష్టు 15 వ తేదీన విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu