HomeTelugu Big Storiesఉత్కంఠ రేపుతున్న కార్తికేయ-2 ట్రైలర్

ఉత్కంఠ రేపుతున్న కార్తికేయ-2 ట్రైలర్

Kartikeya2
హీరో నిఖిల్, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన కార్తికేయ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా కార్తికేయ-2 రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. అనుపమ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో విడుదల చేశారు. సస్పెన్స్, థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్ చూశాక సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

సముద్రంలో దాగివున్న ద్వారకా నగరం వెనుక ఉన్న రహస్యాన్ని కనిపెట్టే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్‌తో అర్ధయింది. ట్రైలర్‌లో ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది. శాంత‌ను ఇది నువ్వు ఆప‌లేని యాగం. నేను స‌మిధ‌ను మాత్ర‌మే. ఆజ్యం అక్క‌డ మ‌ళ్లీ మొద‌లైంది..అనే సంభాష‌ణ‌ల‌తో ట్రైల‌ర్‌ మొదలైంది. అస‌లు కృష్ణుడేంటి..ఈ క‌థ‌ను ఆయ‌నే న‌డిపించ‌డ‌మేంటి అంటాడు నిఖిల్.. విశ్వం ఒక పూస‌ల దండ‌..ప్ర‌తీది నీకు సంబంధ‌మే అంటూ అనుపమ్ ఖేర్ సంభాషణలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ జులై 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu