ఈ పాట నన్ను ఎంత హత్తుకుందో చెప్పలేను: సన్నీలియోనీ

ఫోర్న్‌ స్టార్‌ నుంచి బాలీవుడ్‌ నటిగా ఎదిగిన సన్నీ లియోనీ జీవితం ఆధారంగా ‘కరణ్‌జీత్‌ కౌర్‌: ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ సన్నీ లియోనీ’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దీన్ని సిరీస్‌ల రూపంలో ప్రసారం చేస్తున్నారు. ప్రస్తుతం రెండో సీజన్‌ జరుగుతోంది. అయితే ఈ సీజన్‌లో భాగంగా సన్నీ పెళ్లి సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో భాగంగా పాటను కూడా రూపొందించారు. దీన్ని సన్నీ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. భారత్‌కు వచ్చిన తర్వాత తనకు బాగా నచ్చిన పాట ఇదేనని అన్నారు.

‘ఈ పాట నన్ను ఎంత హత్తుకుందో చెప్పలేను. ఈ పాటలోని మొత్తం భావోద్వేగాన్ని వర్ణించలేను. నేను భారత్‌కు వచ్చిన తర్వాత నాకెంతో నచ్చిన పాటను ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆదిత్యా దత్’ అని సన్నీ ట్విటర్‌లో పేర్కొన్నారు. దీంతోపాటు పాట వీడియోను షేర్‌ చేశారు.

‘కరణ్‌జీత్‌ కౌర్‌’ బయోపిక్‌లోని ఈ పాటను చూశాక చాలా భావోద్వేగానికి గురయ్యా. ఇప్పటి వరకు ఎలాంటి జీవితాన్ని గడిపాం. సన్నీ లియోనీ నిన్ను చివరి దాకా ప్రేమిస్తూనే ఉంటా. మనం ఇద్దరం కలిసి సాధించాల్సింది చాలా ఉంది’ అని ఇదే సందర్భంగా సన్నీ భర్త డేనియల్‌ వెబర్‌ ట్వీట్‌ చేశారు. ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి స్పందన లభించింది. కొన్ని గంటల్లోనే 4 లక్షల మందికిపైగా వీక్షించారు. 10 వేల మందికి పైగా లైక్‌ చేశారు.